Sunday, March 20, 2011

naa matrubasha telugu

ఆహ, నమ్మలేక పోతున్న, నేను రాసే పదాలన్ని తెలుగు లో ఆటోమాటిక్ గ అనువదిమ్పబడుతున్నేను.
కాకపోతే అచ్చమైన తెలుగు లో రాయాల్సి వస్తుంది, ఎందుకంటే గూగుల్ సాఫ్ట్వేర్ స్పష్టమైన తెలుగు కోడ్ అయ్యి ఉంటుంది కదా.

సరేలే, మాతృ భాష లో మాట్లాడుతున్న, అందులో పదాలు రాస్తున్న ఆ సుఖం వర్ణనాతీతం.
తెలుగు భాష ఎంత తియ్యన, అచ్చం తేనే తగినట్లే ఉంటుంది. తేనే కూడా అంట తియ్యగా ఉండదేమో.
నేను భాష వేదిణా? ఏమో తెలిదు, కాకపోతే మాతృ భాష మీద మమకారం ఎక్కువే నాకు.

చెన్నై లో విప్రో లో పని చేసేటప్పుడు, అమ్మ వాళ్ళని చూడటానికి ఒంగోలు వెళ్ళినప్పుడల్లా ఒక తెలుగు సాహిత్యపు పుస్తకం కొనేవాడిని, అప్పుడే శ్రీ శ్రీ పుస్తకాలూ చదివా, కమ్మని తెలుగు సాహిత్యాన్ని నోరార చదివి ఆనందించ.
ఆహ్, మరో జన్మ ఉంటె తెలుగే నా మాతృ భాష ల ఉండేటట్లు పుట్టించు వొహ్ భగవంతుడా.

గురజాడ అప్పారావు గారి పద్యాలూ చదివాను, చాల బాగున్నై. ఆ పుస్తకాలన్నీ ఇప్పుడు తెనాలి లో నేను కొత్త గ కొన్న ఇంటిలో ఉన్నాయ్, వెళ్ళినాక బూజు దులిపి మల్లి మా శ్రీ శ్రీ గారిని గుర్తుచేసుకోవాలి.
అలానే గుంటూరు కుటుంబ రావు నవల సంపుటి అనే ఒక పుస్తకం కొన్నాను, చాల పెద్ద పుస్తకం, చదివే లోపే ఖండాంతర ప్రదేశానికి వచ్చేసాను. అదే ఆస్ట్రేలియా లో ఉంటున్న ఇప్పుడు, మేల్బౌర్నే లో.
నా తియ్యని తెలుగు లో మాట్లాడటానికి ఒకల్లో ఇద్దరో ఉన్నారు ఆఫిలే లో అంటే, అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడుతుంట అంటే.

ఎంత ఖర్మ పట్టింది నాకు, నా భాష లో మాట్లాడటానికి ఎవరు లేరా, మా ఆఫీసు లో చాల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, సో అప్పుడప్పుడు మాట్లాడుతుంట సో పర్వాలేదు లే.

అప్పుడప్పుడు బ్రహ్మానందం, సునీల్, మస్ నారాయణ కామెడీ విదేఒస్ యౌతుబే లో చూస్తూ ఆనందిస్తున.
ఆ, మన లోక్ సత్తా పార్టీ నాయకులూ జప్ గారి వ్యాఖ్యానాలు కూడా చూస్తుంట.

ఈ తెలంగాణా వాళ్ళు ట్యాంక్ బుండ్ విగ్రహాలను పడగొట్టిన వార్త చదువుతుంటే ఎంత బాధ వేసిందో, కానీ ఎం చెయ్యను, ముర్ఖులంతా ఒకటై చేసిన పని, మన పోలీసు వ్యవస్థ అదుపు చేయఎలేకపోయారు.
నా వాళ్ళు, నా మహనీయుల విగ్రహాలను పడగోత్తతనికి ఎంత దమ్ములు మీకు?
ఆ రోజు ఈ దుష్కర్మ చేసిన వాళ్ళందరికీ ఒక ప్రసన?
మీ విగ్రహం అలానే ప్రజల్లో గుర్తుందేతట్లు ఎమన్నా పని చేసారా మీలో ఒక్కరైన? మీకు ఆ అర్హత ఉండ? మీకు కనీసం  ఆ మహనీయుల పక్కన నుంచునే అర్హత కూడా లేదే, ఎంత ధైర్యం మీకు?
మీరు నిజం గ తెలుగువారిన? సిగ్గు చేటు?
మంచి కలం రాణే వస్తుంది, అప్పుడు మీలాంటి ప్రతి మూర్ఖుడికి అర్ధముతుంది.

భాష నిర్మాణం, ఒక వ్యవస్థ నిర్మాణం, జాతి నిర్మాణం అనేవి చాల శ్రద్ధ తో వోపిక తో జరిగే పనులు, మీరందరూ ఒక జాతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు, జప్ గారు అసెంబ్లీ లో చాల బాగా వ్యాఖ్యానం ఇచ్చారు,

ఎవరైతే ఒక జాతి నిర్మూలనకు పల్పడుతున్నదో, వాడు సంఘ విద్రోహక శక్తి గ పరిగానిమ్పబడతాడు, అటువంటి వాడికి ఈ జాతిలో అందరితో పటు ఉండే అవకాసం ఉండకూడదు.

వచ్చే ఎలేచ్షన్స్ లో జప్ గారు ముఖ్య మంత్రి ఐతే, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్క సరి ఆలోచిస్తేనే ఎంత ఆనందం.
ఎలా ఉంటుంది? నాకైతే అన్ని వదిలేసి అయన పార్టీ లో కలిసి పని చేద్దామని ఉంది, కానీ నా బాధ్యతలు కొన్ని ఉన్నాయ్.
అన్ని పెళ్ళైతే చేసేసాను, అమ్మ వాళ్ళకి ఇల్లు కూడా కొనిచేసను, ఇప్పుడా ఇంటి అప్పు తీర్చాలి, తర్వాత నా పెళ్లి, జీవితాంతం ఒక్కడినే ఉండలేను కదా, నాకు కూడా తోడూ కావాలి, అందుకే పెళ్లి.

కొట్టుకున్న, తిట్టుకున్నా జీవితం లో నీతో కలిసి ఒకరు ఉంటె అది మన జీవితపు రేఖలకే అర్ధం తెస్తుందని న భావన.

తెలుగు లో బ్లాగ్ రాయటం కొంచెం కష్టమే, అన్ని పదాలు కరెక్ట్ గ కాంవేర్ట్ అవ్వట్లేదు.
ఇంకా నేను చాల చెయ్యాలని అనుకుంటున్నా, అందరి లాగానే.
కానీ కొన్ని చేశాను మరి కొన్ని చెయ్యాలి, నా స్వగ్రామం తెనాలి లో ఎవైన పతసలలు కానీ, వృద్ధాప్య గృహాలకు సహాయం చెయ్యాలి, బాగా డబ్బులు సంపాదించి నా ఊరిలో, నా రాష్ట్రం లో పెదరికతను నిర్మూలించాలి.
అంటే నేను బతికుండగానే ఆంధ్ర రాష్ట్రం లో పేదవాడు అనే వాడు ఉండదు, అః, ఇది నిజామా కల?
ప్రస్తుతానికి కలే, నిజం అవ్వాలంటే నా లాంటి వాళ్ళు ఒక లక్షస మంది కావాలేమో.
అః లేక నేను ఒక్కడినే చాల? సరిపోతుందిలే, నేనే గనక వచ్చే పది సంవత్సరాలలో ఒక వెయ్య కోట్లు సంపదిన్చాననుకో, అప్పుడు జప్ గారికి ఫుల్ గ నిధులు ఇస్తాను, అయన పార్టీ ని గెలిపించి ముఖ్య మంత్రిని చేసేటట్లు చేస్తా.
ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు నేనే ముఖ్య మంత్రిని అవ్వొచ్చు కదా, అవ్వొచ్చు కానీ నాకన్నా పెద్దవారు, బాగా తెలిసిని వారు ఉన్నారు కదా మన జప్ గారు, సో ఆయననే రాష్ట్రాన్నినడిపిద్దాం.
నాకు ఇప్పటికి అనిపిస్తుంది నేను కరణ జన్ముడిని అని, అల ఐతే అందరు కరణ జన్ములే.  అల అని అందరు అనుకుంటార లేక నేనోక్కదినేన? 
అందరు దేవుని ప్రతిబింబాలే ఐనప్పుడు ఎందుకు దేశం లో ప్రపంచం లో ఇంట అరాచకం, ఇంట అవినీతి?
ఇది తెలుసుకోవటం చాల కష్టం. 
నాకు నా మాతృ భాష లో డాక్తోరాటే చెయ్యాలని ఉంది, భారత దేశానికీ వెళ్ళినప్పుడు తప్పకుండ ప్రయత్నిస్త.
సమయం పన్నెండు కావొస్తోంది, రేపు ఆఫీసు కి వెళ్ళాలి కదా మరి, పోడుకోవాలి కదా మరి.
అచ్చం జంధ్యాల గారి లాగానే ఉన్నాయ్ కదా ఈ పదాలు, సరే సరే జంధ్యాల గారి గురించి తర్వాత ప్రస్తావిస్త.
ఇప్పటికి పొడుకుంట.
ఇంకా సెలవు.

2 comments:

  1. Hi Chaitu... I could not read your post 'naa maatrubasha telugu' on browsers (firefox and safari). Should I download any font and keep it on my local machine?

    ReplyDelete
  2. not sure dantam, I selected "telugu" language in the blog and whatever I wrote it was translated automatically into telugu.
    I am using Google Chrome, try opening in Chrome

    ReplyDelete